యెస్​ బ్యాంక్​లో వాటా అమ్మనున్న ఎస్​బీఐ

న్యూడిల్లీ:  ఎస్​బీఐ..యెస్ బ్యాంక్‌‌లో ఉన్న రూ.18,040 కోట్ల ( 2.2 బిలియన్ డాలర్ల) విలువైన 24శాతం వాటాను విక్రయించడానికి మార్చి చివరి నాటికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

జపనీస్ లెండర్​ సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్ప్,  దుబాయ్‌‌కి చెందిన ఎమిరేట్స్ ఎన్‌‌బిడి యెస్ బ్యాంక్‌‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నాయని ఈ  వర్గాలు తెలిపాయి.