ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్న వినియోగదారులకు ఇది కొంచెం మింగుడుపడని వార్తే. ఎందుకంటే.. ఎస్బీఐ కార్డ్.. క్రెడిట్ కార్డ్ ఛార్జీల్లో కొన్ని మార్పులుచేర్పులు చేసింది. నవంబర్ 1 నుంచి ఏకకాలంలో రూ.50 వేలకు మించి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి చేసే యుటిలిటీ బిల్ పేమెంట్స్పై 1 శాతం సర్ఛార్జ్ విధించాలని ఎస్బీఐ నిర్ణయించింది. అంతేకాదు.. అన్ని అన్ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్పై నవంబర్ 1, 2024 నుంచి నెలకు 3.75 శాతం ఫైనాన్స్ ఛార్జ్ అమల్లోకి రానుంది. ఈ ఫైనాన్స్ ఛార్జ్ నుంచి శౌర్య/డిఫెన్స్ కార్డులకు మాత్రం మినహాయింపు దక్కింది.
చేతిలో డబ్బు లేనప్పుడు, షాపింగ్ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో క్రెడిట్ కార్డ్‌లు చాలా ఉపయోగపడుతాయి. కొనుగోళ్లు చేయడానికి, రివార్డ్‌లను సంపాదించడానికి ఇవి పనికి వస్తాయి. క్రెడిట్ కార్డ్‌తో ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ వీటి వాడకంపై కొన్ని పరిమితులు ఉంటాయనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.
ALSO READ | Gold Rates: మంటెత్తిస్తున్న గోల్డ్ రేట్స్.. ఈ పండుగ సీజన్లో బంగారం ఇంకేం కొంటారు..!
ఆలస్యంగా క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించినా జరిమానాలు పడతాయి. మినిమం అమౌంట్ (కనీస బిల్లు) కట్టకున్నా, ఆలస్యంగా చెల్లించినా ఫైన్లు తప్పవు. క్రెడిట్ కార్డ్ హోల్డర్లు కనీస బకాయి మొత్తాన్ని సకాలంలో చెల్లించకున్నా, ఆలస్యంగా చెల్లించినా క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అంతేగాక బ్యాంకులు ఫ్లాట్ ఫీజును వసూలు చేస్తాయి. కనీస బకాయి మొత్తాన్ని చెల్లించినంత మాత్రాన వడ్డీ నుంచి తప్పించుకోలేం. అంతేగాక అన్ని క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లకు జీఎస్టీ వర్తిస్తుంది. క్రెడిట్ కార్డ్ ఫీజులో 18 శాతం వరకు వసూలు చేస్తారు.