ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని ఎస్ బీఐటీ కాలేజ్ స్టూడెంట్స్ టీసీఎస్ కంపెనీ ప్రతిఏటా నిర్వహించే నేషనల్ లెవల్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులైనట్లు ఆ కాలేజ్ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. వివిధ దశలలో నిర్వహించే ఈ పరీక్షలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని చెప్పారు. కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. టీసీఎస్ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ పేరుతో నిర్వహించే ఈ పరీక్షకు అర్హత సాధించడంతో ప్రముఖ బహుళజాతి కంపెనీ టీసీఎస్ లో ఉద్యోగానికి ప్రాథమికంగా ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్
డాక్టర్ జి. ధాత్రి తెలిపారు. ప్రైమ్, డిజిటల్, నింస్థ లాంటి స్థాయిలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారని, వారికి వార్షిక ఆదాయంగా 3.6 లక్షల నుంచి 10 లక్షల వరకు అందుతుందని చెప్పారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే 430 పైగా ఉద్యోగాలను తమ విద్యార్థులకు అందించామని, వాటితో పాటుగా ఇటువంటి జాతీయస్థాయి అర్హత పరీక్షలలో కూడా తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చి ఉద్యోగాలకు అర్హత సాధించారని ప్రిన్సిపల్ డాక్టర్ జి. రాజ్ కుమార్ తెలిపారు.
అర్హత సాధించిన విద్యార్థులను గురువారం వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డాక్టర్ ఏవీవీ శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డాక్టర్ జె. రవీంద్రబాబు, డాక్టర్ ఎన్. శ్రీనివాసరావు, టీపీవో ఎన్.సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.