జేఎన్టీయూ రిజల్ట్స్ లో ఎస్​బీఐటీ ప్రభంజనం

ఖమ్మం టౌన్, వెలుగు :  ఇటీవల వెలువడిన జేఎన్టీయూ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ లో ఎస్ బీఐటీ కాలేజ్ స్టూడెంట్స్ ప్రభంజనం సృష్టించారని ఆ కాలేజ్ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. యూనివర్సిటీ స్థాయిలో తమ విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించడం తమకు గర్వకారణమని అభిప్రాయపడ్డారు. జిల్లాలోనే తమ విద్యార్థులు 9.50, ఎస్ జీపీఏ తో అగ్రగామిగా నిలిచారని కాలేజీ సెక్రటరీ అండ్  కరస్టాండెంట్ డాక్టర్ జి. ధాత్రి తెలిపారు. 

సీఎస్ఈ తో పాటుగా ఈసీఈ, సీఎస్ఎంస్ డీ విభాగాలలో కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించారని చెప్పారు. ప్రతిభ కనబరచిన వారిలో సీఎస్ ఎం నుంచి ఎం.హరిణి (9.50) సీహెచ్.కళ్యాణి (9.35), పీ.స్వాతి, టీ.నాగ త్రీశూలా చారి (9.05)తో ముందున్నారని తెలిపారు. సీఎస్ఈ నుంచి ఆర్.సౌజన్య (9.25)ఏ.యామిని, జీ.లోహితారెడ్డి, కే.భార్గవీ సత్యశ్రీ, ఎస్.కె. అర్షద్(9.05)సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జి. రాజ్ కుమార్ తెలిపారు. 

ఈసీఈ నుంచి ఎస్​కే షాహనాజ్(9.0)తో పాటుగా ఇంకా ఎందరో విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబబర్చినట్లు చెప్పారున. విభాగ అధిపతి టి.గంగాధర్, లెక్చరర్లు స్టూడెంట్స్​ను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్. కె.అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్లు గంధం శ్రీనివాసరావు, డాక్టర్  ఏవీవీ శివ ప్రసాద్, జీ. ప్రవీణ్ కుమార్, డాక్టర్ జే.రవీంద్రబాబు, డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు, హెచ్ వోడీలు పాల్గొన్నారు.