మార్చి 18న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ

మార్చి 18న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ

 

  • ఎమ్మెల్యేలు మాట్లాడాక సీఎం రేవంత్ రెడ్డి సమాధానం 
  • బిల్లును ఆమోదించిన తర్వాత వర్గీకరణ అమలుపై జీవోలు

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరగనున్నది.  అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. సోమవారం ఈ బిల్లును అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. 

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వన్ మ్యాన్​ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో టేబుల్ చేసింది. మంగళవారం ఈ బిల్లును ఆమోదించిన తర్వాత వర్గీకరణ అమలుపై ప్రభుత్వం జీవో లు ఇవ్వనుంది. వీటితోపాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై హిందూ రిలీజియస్ సవరణ బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్, మున్సిపాలిటీల సవరణ బిల్లు,  పంచాయతీ రాజ్ సవరణ (మిషన్ భగీరథ) బిల్లులకు సభ  ఆమోదం తెలుపనున్నది.