15-20 రోజుల్లో SC వర్గీకరణ చట్టం: మంత్రి దామోదర రాజనర్సింహ

15-20 రోజుల్లో SC వర్గీకరణ చట్టం: మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్: వచ్చే 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. సోమవారం ( ఫిబ్రవరి 17) హైదరాబాద్‎లోని టూరిజం కన్వెన్షన్ హల్‎లో ఎస్సీ వర్గీకరణపై మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని.. చట్టం వచ్చిన వెంటనే 25 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. 

ఆరు నెలల్లోనే 90 శాతం వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. రాబోయే సమావేశాల్లోనే చట్టం చేస్తే వర్గీకరణ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మనం చేసేది ప్రజలు గమనించాలని.. మనం గొప్పలు చెప్పుకోవడం కాదని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఎబీసీడీ కాకుండా.. గ్రూప్స్‎లు ఎందుకొచ్చాయని కొందరు ప్రశ్నిస్తున్నారని.. వారి అనుమానాలను నివృత్తి చేస్తామని.. ఆ బాధ్యత మాదని అన్నారు మంత్రి దామోదర రాజనర్సింహా.