మందకృష్ణను సంతృప్తి పరచడానికే వర్గీకరణ బిల్లు

మందకృష్ణను సంతృప్తి పరచడానికే వర్గీకరణ బిల్లు
  • వర్గీకరణ బిల్లుల ప్రతులను చించేసి నిరసన తెలిపిన మాల సంఘాల నాయకులు

ఖైరతాబాద్, వెలుగు: మందకృష్ణ మాదిగను సంతృప్తి పరచడానికే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించారని మాల సంఘాల ప్రనిధులు ఆరోపించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో సౌత్​ఇండియా సమతా సైనిక్​దళ్ అధ్యక్షుడు మార్షల్​దిగంబర్​కాంబ్లీ, మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రామ్​ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. షమీమ్​అక్తర్​కమిషన్ నివేదిక తప్పుల తడక అన్నారు. 

కాంగ్రెస్​పార్టీని గెలిపించిన మాలలను విస్మరించి, బీజేపీకి ఓటు వేయండని పిలుపునిచ్చిన మందకృష్ణను సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ఆమోదించిందన్నారు. ఈ బిల్లును సుప్రీం కోర్టు కొట్టేయడం ఖాయమన్నారు. మాలలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని కూలుస్తామనిహెచ్చరించారు. మాలలను రాజకీయంగా అణిచి వేయడానికి కుట్ర జరుగుతోందన్నారు. వర్గీకరణ బిల్లు పత్రాలను చించివేశారు.