వనపర్తి టౌన్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ రాజనగరం రాజేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు 2004లో రద్దు చేసినప్పటి నుంచి విద్య, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన మాదిగ ఉప కులాలకు 12 శాతం విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కాలని తెలిపారు. జూన్ 2 నుంచి 12 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎర్రమోని యాదగిరి, రాజనగరం రాజేశ్, శివకుమార్, కొమ్ము కేశవులు, పరుశురాం, బాబు, సాయికుమార్ పాల్గొన్నారు.