ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తున్నాం: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తున్నాం: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి
  •     ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి 
  •     వర్గీకరణపై సుప్రీం తీర్పునకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట​ ఆందోళన

బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలిపింది. కోర్టు తీర్పునకు నిరసనగా సోమవారం లక్డీకపూల్‌‌‌‌‌‌‌‌లోని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు సమితి నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సమితి చైర్మన్లు జి.చెన్నయ్య, చెరుకు రామచందర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. వర్గీకరణ అంశంపై మొదట పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో బిల్లు పెట్టి చర్చ జరపాలని , 2/3 మెజారిటీ వస్తేనే వర్గీకరణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. 

ఈ తీర్పు దళితుల మధ్య చిచ్చుపెట్టెలా ఉందని విమర్శించారు. దీని వల్ల ఎస్సీ ఉప కులాలతో పాటు ఎస్టీలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పులాగా లేదని.. ప్రధాని మోదీ స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌లా ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ధోరణి మార్చుకోవాలని, 2004లో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిగణనలోకి తీసుకొని, వర్గీకరణ చేయాలన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా ఈ తీర్పు ఉందని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ తీర్పుపై న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టులో 11 మంది జడ్జిల దగ్గర రివ్వూ పిటిషన్, 15 మంది జడ్జిల దగ్గర అప్పీల్ దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు దాసరి భాస్కర్, ఎస్.నగేశ్‌‌‌‌‌‌‌‌, మాన్య రంగ, మేక వెంకన్న, శ్రీధర్, వినోద్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.