కల్లూరు మండలలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో  నిరసన

కల్లూరు మండలలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో  నిరసన

కల్లూరు,  వెలుగు  :  కల్లూరు మండల పరిధిలోని కిష్టయ్యబంజర గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు తాగు నీటి కోసం మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.   మిషన్ భగీరథ వాటర్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే  సరఫరా అవుతుందని,  ఎస్సీ కాలనీ లోని 30 కుటుంబాలకు మిషన్ భగీరథ నీరు  రావడం లేదని ఆవేదన చెందారు.

 ప్రస్తుత ఇన్​చార్జి కార్యదర్శిని  అడిగితే పంచాయతీలో నిధులు లేవంటూ సమాధానం చెబుతున్నట్టు తెలిపారు. అధికారులు స్పందించి తాగునీరు అందించాలని డిమాండ్​ చేశారు.  కార్యక్రమంలో కిష్టయ్య బంజారా ఎస్సీ కాలనీకి చెందిన పెరుమళ్ళపల్లి రమేశ్, దాసు ,వాడపల్లి లెనిన్, మహేశ్​, సురేఖ  పాల్గొన్నారు.