- రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో వెల్లడి
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: ఈ నెలాఖరు వరకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్దఅంబర్ పేట్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌జిల్లా ఎస్సీ సెల్ ఆఫీస్‌ను రాష్ట్ర పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్, డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి,-రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెంటయ్యతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ-న్యాయం జరుగుతుందని డీసీసీపీ చల్లా నర్సింహారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. లీడర్లుమల్ రెడ్డి అభిషేక్ రెడ్డి, నరేందర్, ప్రమోద్, భాస్కర చారి, కొత్తపల్లి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.