వార్డెన్​ రుచి చూశాకే భోజనం వడ్డించాలి

వార్డెన్​ రుచి చూశాకే భోజనం వడ్డించాలి
  • ఎస్సీ డెవలప్​మెంట్ ప్రిన్సిపల్​ సెక్రటరీ శ్రీధర్ ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హాస్టల్ వార్డెన్​ భోజనం రుచి చూశాకే స్టూడెంట్లకు వడ్డించాలని ఎస్సీ డెవలప్​మెంట్ ప్రిన్సిపల్​సెక్రటరీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. దిల్ సుఖ్​నగర్ లోని బండ్లగూడ ఎస్సీ బాయ్స్​హాస్టల్, సైదాబాద్ ఎస్సీ గర్ల్స్​ హాస్టల్​ను గురువారం ఆయన హైదరాబాద్ జిల్లా ఎస్సీ వెల్ఫేర్​ఆఫీసర్​యాదయ్యతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీల ప్రకారం ఫుడ్ మెనూ ఉందో లేదో ఆరా తీశారు. వార్డెన్లు భరత్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.