సుప్రీంకోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఊరట లభించింది.2018 మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. డీకే శివకుమార్ పై మోపిన అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
2017లో ఆగస్టులో డీకే శివకుమార్ ఇంట్లో దాడులు చేసిన ఐటీ అధికారులు ఆదాయానికి మించి నగదును స్వాధీనం చేసుకున్నారు. తర్వాత 2018లో డీకే శివకుమార్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. 2019లో డీకేను ఈడీ అరెస్ట్ చేసింది.
ALSO READ :- సీఎం రేవంత్ తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ
తర్వాత నెల రోజులకు ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనను విచారణ నుంచి తప్పించాలని డీకే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని కేసును కొట్టివేసింది.