- ఆరు బయటే నిల్చున్న స్టూడెంట్స్, పేరెంట్స్
- ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోటలో ఘటన
ఖమ్మం టౌన్,వెలుగు : పది నెలలుగా అద్దె, కరెంట్ బిల్లు చెల్లించడం లేదని సోమవారం ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోటలోని తిరుమలాయపాలెం ఎస్సీ గురుకుల స్కూల్ బిల్డింగ్ కు ఓనర్ తాళం వేశారు. సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్ కు వచ్చిన స్టూడెంట్స్, పేరెంట్స్ బయట నిల్చున్నారు. తాళం వేసిన విషయంపై కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కు, జోనల్ ఆఫీసర్ స్వరూప రాణికి స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు.
వెంటనే స్పందించిన అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే మంజూరు చేయిస్తామని ఓనర్ కు సూచించారు. వెంటనే విద్యుత్ బిల్లు చెల్లిస్తామని తెలపడంతో బిల్డింగ్ తాళం తీశారు. స్టూడెంట్స్ లోపలికి వెళ్లిపోయారు.