
- ప్రిన్సిపాల్స్, టీచర్లకు ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో ఎస్సీ గురుకులాల విద్యార్థులు100 శాతం ఉతీర్ణత సాధించేలా సంబంధిత ప్రిన్సిపాల్స్, టీచర్లు సమష్టిగా కృషి చేయాలని ఎస్సీగురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఆదేశించారు. బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలుప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం రాష్ర్టంలో ఎస్సీ గురుకులాల ప్రిన్సిపాల్స్, టీచర్లతో సెక్రటరీ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎగ్జామ్స్ టైమ్ లో స్టూడెంట్స్ కు పోషకాహారం అందించాలని సూచించారు.
స్టడీ అవర్స్ టైమ్ లో స్టూడెంట్స్ కు టీచర్లు అందుబాటులో ఉండి వారి సందేహాలు నివృతి చేయాలని ఆదేశించారు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని గురుకుల కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ఎట్టి పరిస్థితుల్లో క్యాంపస్ వదిలి వెళ్లొద్దన్నారు. అలాగే కాలేజీలలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా తన దృష్టికి వెంటనే తీసుకురావాలని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ఆస్కారం ఉంటుందని ఆమె ప్రిన్సిపాల్స్ కు సూచించారు. పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించామని తెలిపారు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.