ప్రకృతి వనాలకు ఎస్సీల భూములా?

ప్రకృతి వనాలకు ఎస్సీల భూములా?

కాంగ్రెస్​ ఎస్సీ సెల్ రాష్ట్ర చీఫ్ నగరిగారి ప్రీతం

సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని మండిపాటు

కాగజ్​నగర్, వెలుగు: పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలకు దళితుల భూములే దొరికినయా అని కాంగ్రెస్ ఎస్సీ సెల్​ రాష్ట్ర అధ్యక్షుడు నగరిగారి ప్రీతం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​ దళిత ద్రోహి అని దళితులు అంటే ఆయనకు గిట్టదు కాబట్టే దళితుల భూములను టార్గెట్​ చేస్తున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలకు వ్యతిరేకంగా సోమవారం కొమురంభీం ఆసిఫాబాద్​లోని కౌటాలలో ర్యాలీ నిర్వహించి, సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. నగరిగారి ప్రీతం చీఫ్ గెస్ట్ గా మాట్లాడారు. భూములు కోల్పోయిన దళితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటు పేరిట కౌటాలలో దళితుల భూములు లాక్కున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ వ్యవహారాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు కూడా ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. డీసీసీ అద్యక్షుడు విశ్వప్రసాద్​ మాట్లాడుతూ.. దేశంలో క్రైమ్​ రేటు పెరిగిందన్నారు. ఇండ్లు కూల్చి ప్రకృతి వనం నిర్మించాలని ఏ చట్టం చెబుతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిర్పూర్​ అసెంబ్లీ ఇన్​చార్జి డాక్టర్​ హరీష్​బాబు మాట్లాడుతూ పేద ప్రజలను టార్గెట్​ చేసుకొని భూములను లాక్కోవడం దుర్మార్గమని దీనిపై తగిన సాస్తి జరుగుతుందన్నారు. ఎస్సీ సెల్​జిల్లా అధ్యక్షుడు వసంత్​రావు, ఓబీసీ చైర్మన్​వెంకటేశ్, మహిళా అధ్యక్షురాలు రాజేంద్రకుమారి, మైనార్టీ అధ్యక్షుడు యూనుస్​ హుస్సేన్​, చింతలమానపల్లి, ఎంపీటీసీల, పార్టీ నేతలు పాల్గొన్నారు.

For More News..

మెరిట్​ ఉన్నా జాబ్​లు ఇస్తలేరు

ఎమ్మెల్సీ క్యాండిడేట్​పై టీఆర్ఎస్​ సస్పెన్స్