కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు

కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: క్రిమినల్ కేసులు ఉన్నోళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. దీనిపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ విషయంలో స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ (ఈసీ)కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్​ను లాయర్ అశ్విని ఉపాధ్యాయ్  ఫైల్ చేశారు. తీవ్రమైన నేర చరిత్ర ఉన్నోళ్లు, సీరియస్ క్రిమినల్ కేసులు నమోదైనోళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని కోరారు.