సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ చివరి తీర్పు..నాగరిక ప్రపంచంలో బుల్డోజర్ న్యాయం కరెక్ట్ కాదు

సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ చివరి తీర్పు..నాగరిక ప్రపంచంలో బుల్డోజర్ న్యాయం కరెక్ట్ కాదు

దేశంలో నిర్మాణాలను శిక్షాత్మకంగా కూల్చివేసే ధోరణి మంచిదికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సీజేఐ డీవై చంద్రచూడ్,న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం చట్టవిరుద్దంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించేందుకు చర్య తీసుకునే ముందు చట్టబద్దమై  ప్రక్రియను అనుసరించాలని నొక్కి చెప్పింది.

బుల్డోజర్ న్యాయం అనుమతించినట్లయితే ఆర్టికల్ 300A ప్రకారం ఆస్తి హక్కు అనేది రాజ్యాంగ గుర్తింపులో డెడ్ లెటర్ గా మారుతుందని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఆర్టికల్ 300A  ప్రకారం ఏ వ్యక్తి తన ఆస్తిని కోల్పోకూడదు.. అధికారం ద్వారా చట్టం వ్యక్తి హక్కు ను కాపాడుతుందన్నారు. 

2019లో ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో ఓ ఇంటిని కూల్చివేతకు సంబందించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. రాష్ట్రం అనుసరించిన తీరు హై హ్యాండెడ్ అని తెలిపింది. బాధితుడిని పరిహారం చెల్లించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇంటిని ధ్వంసం చేసినం దుకు పిటిషనర్ కు రూ. 25లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. 

ఆస్తులు, ఇంటి స్థలాలను ధ్వంసం చేయడం ద్వారా పౌరుల గొంతుకను అడ్డుకోలేం.. ప్రతి మనిషి అంతిమ భద్రత ఇల్లు అని సీజీఏ రాసిన తీర్పు చెబుతోంది. నవంబర్ 6 న వెలువడిన తీర్పు సుప్రీంలో అప్ లోడ్ చేయబడింది.