- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : ఎస్సీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన 18 శాతానికి పెంచాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి బుధవారం ఎంపీ కడియం కావ్యతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తమ హక్కని, రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలని సూచించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మండల కమిటీ అధ్యక్షుడు జూలకంటి శిరీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారజోడు రాంబాబు, మార్కెట్ చైర్‌పర్సన్ జూలకుంట్ల లావణ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, పోగుల సారంగపాణి పాల్గొన్నారు.