
హైదరాబాద్ ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎల్బీ నగర్ పీఎస్ ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశారు. సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సుధీర్ రెడ్డిపై డీసీపీ, ఏసీపీ, సీఐలకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. దీంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఎల్బీనగర్ పోలీసులు.
కాంగ్రెస్ నేత మధుయాష్కీకి హస్తినాపురం కార్పొరేటర్ కు హనీమూన్ నడుస్తుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మన్సూరాబాద్, చంపాపేట్ కార్పొరేటర్ లపై కామెంట్స్ చేస్తూనే హస్తినాపురం కార్పొరేటర్ తో మధుయాష్కీకి హనీమూన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుధీర్ రెడ్డి. ఈ క్రమంలోనే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.
ALSO READ | వర్గీకరణతో అపోహలు తొలగాలి..మాలలకు 48 వేల జాబ్స్ వస్తే.. మాదిగలకు 65 వేలు : ఎమ్మెల్యే వివేక్