అంగన్​వాడీ టీచర్ పై దాడి.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

అంగన్​వాడీ టీచర్ పై దాడి.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

కారేపల్లి, వెలుగు: అంగన్​వాడీ టీచర్ పై దాడి చేసిన వ్యక్తి పై కారేపల్లి పోలీస్ స్టేషన్​లో శుక్రవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్సై రాజారాం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కారేపల్లి క్రాస్ రోడ్ అంగన్​వాడీ కేంద్రంలో భూక్య పుష్పలత టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

అదే గ్రామానికి చెందిన ఆవుల వెంకట్రావు అనే వ్యక్తి కేంద్రం వద్దకు వెళ్లి పుష్పలతను అకారణంగా  దుర్భాషలాడి చెంప మీద కొట్టి చంపుతానని బెదిరించాడు. పుష్పలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట్రావు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.