వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోఓ ఎస్.ఐ తీరు స్థానికంగా కలకలం రేపుతుంది. మహిళా ఉద్యోగిని వేదిస్తున్నాడని ఎస్.ఐ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే కాకతీయ యూనివర్సిటీ పోలిస్ స్టేషన్ లో ఎస్.ఐగా అనిల్ విధులు నిర్వహిస్తున్నాడు. గత అసెoబ్లీ ఎన్నికల సమయంలో ఓ మహిళా ఉద్యోగస్తురాలితో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయాన్ని అడ్డంపెట్టుకొని ఎస్. ఐ అనిల్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు స్టేట్ మెంట్ విన్న పోలీసులు ఎస్.ఐ అనిల్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.