ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో హత్యకు గురైన కానిస్టేబుల్ నాగమణి భర్త శ్రీకాంత్ కుటుంబాన్ని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. నాగమణి హత్య పథకం ప్రకారం జరిగిందని, సుమారు పదిమంది నిందితులు ఉన్నట్లు తెలుస్తుందన్నారు.
నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. చంపుతామని హెచ్చరించినా రక్షణ కల్పించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందన్నారు. ఈ దారుణానికి పాల్పడినవారిపై చట్టపకారం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఆ కుటుంబానికి భూమి, ఇళ్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.