- బాధితులకు అండగా ఉంటం
- ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్సీరియస్
- అధికారులపై దాడిని ఖండిస్తున్నం
- కమిషన్‌చైర్మన్ బక్కి వెంకటయ్య
హైదరాబాద్: లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఇవాళ లగచర్ల గిరిజన కుటుంబాలతో బీఆర్ఎస్నాయకులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఒక్కి వెంకటయ్యను కలిశారు.
లగచర్ల లో జరిగిన ఘటనపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మాసిటీ కోసం గిరిజ నుల భూములను బలవంతంగా లాక్కోవడం కరెక్ట్ కాదన్నారు.
ALSO READ | మూసీ వాస్తవ పరిస్థితిని తెలుసుకోండి:ఎంపీ చామల
‘ప్రభుత్వం వారి ల్యాండ్‌ను లాక్కుంటే, భూమిని నమ్ముకున్న గిరిజన కుటుంబాలు అన్యాయం అవుతాయి. ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదు. ఇందులో భూమి కోల్పోతున్న ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయాలి. స్వేచ్ఛగా జీవించే హక్కు అంబేద్కర్ కల్పించారు.
లగచర్లలో కమిషన్ త్వరలో పర్యటిస్తుంది. కమిషన్ ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటుంది.అన్యాయం జరిగితే కమిషన్ అసలు ఊరుకోదు.అధికారులు మీద జరిగిన దాడులు కమిషన్ ఖండిస్తుంది.’ అని బక్కి వెంకటయ్య అన్నారు.