బాసర త్రిపుల్​ఐటీ చీఫ్ వార్డెన్ శ్రీధర్​ను తొలగించండి: ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఆదేశాలు

బాసర త్రిపుల్​ఐటీ చీఫ్ వార్డెన్ శ్రీధర్​ను తొలగించండి: ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఆదేశాలు

బాసర త్రిపుల్​ ఐటీలో ఎస్సీ, ఎస్టీ కమిషన్​ పర్యటించింది.  కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. చీఫ్​ వార్డెన్​ శ్రీధర్​ పిల్లలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. అసభ్యకరంగా ప్రవర్తించిన చీఫ్​ వార్డెన్​ శ్రీధర్​పై అధికంగా ఫిర్యాదులు రావడంతో విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.   ఫ్యాకల్టీల కొరత.. సరిపడ కేర్​ టేకర్లు లేరని విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ కమిషన్​ కు తెలిపారు.  ముందుగా తాము విజిట్​ చేసేందుకు వస్తున్నామని సమాచారం ఇచ్చినా.. చీఫ్​ వార్డెన్​​ శ్రీధర్​ కమిషన్​ ఎదుట హాజరు కాకపోవడంతో అధికారులు సీరియస్​ అయ్యారు. 

బాసర త్రిపుల్​ ఐటీలో 6 వేల బాలికలు విధ్యనభ్యసిస్తుండగా... కేవలం నలుగురు మాత్రమే కేర్​ టేకర్లు ఉండటంపై కమిషన్​ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేర్​టేకర్లను పెంచాలని ఆదేశాలు జారీచేశారు.  కళాశాలలో సరిపడ ఫ్యాకల్టీ లేరని... ఉన్నత విద్యలో చాలా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఫిర్యాదు చేశారు.  ఈ విషయంలో ఇంఛార్జ్​ వీసీ వెంకటరమణ సమాధానం ఇస్తూ ప్రభుత్వం ఫ్యాకల్టీలను నియమించేలా కసరత్తు చేస్తుందని.. కమిషన్​ కు వివరించారు. విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన చీఫ్​ వార్డెన్​ శ్రీధర్​పై అధికంగా ఫిర్యాదులు రావడంతో విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. 

ALSO READ | అతివలకు అండగా.. ఇందిరా మహిళా శక్తి