హైదరాబాద్, వెలుగు: పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ల కోసం ఎస్సీ స్టూడెంట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. 2024–25 అకడమిక్ ఇయర్ కు సంబంధించి స్కాలర్ షిప్ ల మంజూరు కోసం కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి దరఖాస్తులు చేసుకోవాలని శుక్రవారం పత్రిక ప్రకటనలో కోరారు. ఈ పాస్ వెబ్ సైట్ లో వివరాలను నమోదు చేసుకోని, ఆ తర్వాత మీ సేవాలో బయో మెట్రిక్ చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఈ పాస్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి పాఠశాలలు, విద్యా సంస్థలు ఈ పాస్ వెబ్ సైట్ డిజిటల్ కీలను కొనుగోలు చేసి దరఖాస్తులను ఆన్ లైన్ లో ధ్రువీకరించుకోవాలన్నారు. విద్యార్థుల బ్యాంకు ఖాతా సీడీంగ్ పూర్తి చేసి వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.