ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై..2 నెలల్లో రిపోర్ట్

ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై..2 నెలల్లో రిపోర్ట్
  • వర్గీకరణపై కమిషన్​ నివేదిక వచ్చాకే కొత్త జాబ్​  నోటిఫికేషన్లు: సీఎం రేవంత్
  • వెంటనే కమిషన్​ను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం
  • డిసెంబర్​ 9లోపు బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే 
  • బీసీ కమిషన్​, ప్లానింగ్​ విభాగం 
  • ఆధ్వర్యంలో నిర్వహణ
  • కో ఆర్డినేటర్​గా సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్​
  • ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు 
  • సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడి

హైద‌‌రాబాద్​, వెలుగు : సుప్రీంకోర్టు తీర్పుకు తగ్గట్టు ఎస్సీ వ‌‌ర్గీక‌‌ర‌‌ణ అమ‌‌లుకు ఏక‌‌స‌‌భ్య న్యాయ కమిషన్​ను వెంటనే నియమించడంతోపాటు 60 రోజుల్లోనే క‌‌మిష‌‌న్ నివేదిక స‌‌మ‌‌ర్పించేలా చూడాల‌‌ని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. క‌‌మిష‌‌న్ నివేదిక స‌‌మ‌‌ర్పించిన తర్వాతే దానికి తగ్గట్టు రాష్ట్రంలో కొత్త జాబ్​ నోటిఫికేష‌‌న్లు జారీ చేయ‌‌నున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బీసీ కులగణనకు సంబంధించి బీసీ సామాజిక‌‌, ఆర్థిక, కుల స‌‌ర్వే ప్రక్రియ‌‌ను కూడా వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

ఈ సర్వే కూడా రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఎస్సీ వ‌‌ర్గీక‌‌ర‌‌ణ అమ‌‌లు, బీసీ సామాజిక‌‌, ఆర్థిక కుల స‌‌ర్వేపై సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ రెడ్డి బుధ‌‌వారం స‌‌మీక్షించారు. ఈ సంద‌‌ర్భంగా ఎస్సీ వ‌‌ర్గీక‌‌ర‌‌ణ‌‌పై త‌‌మ‌‌కు అందిన విన‌‌తులు.. పంజాబ్‌‌, త‌‌మిళ‌‌నాడు రాష్ట్రాల్లో వ‌‌ర్గీక‌‌ర‌‌ణ అమ‌‌ల‌‌వుతున్న తీరు.. హ‌‌ర్యానాలో తీసుకుంటున్న చ‌‌ర్యల‌‌ను ఎస్సీ వ‌‌ర్గీక‌‌ర‌‌ణ‌‌కు సంబంధించిన కేబినెట్​ సబ్​ కమిటీ సభ్యులు, మంత్రులు ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి, దామోద‌‌ర రాజ‌‌న‌‌ర‌‌సింహ‌‌, శ్రీ‌‌ధ‌‌ర్‌‌బాబు, సీత‌‌క్క, పొన్నం ప్రభాక‌‌ర్ స‌‌మావేశంలో వివ‌‌రించారు.

ఎటువంటి న్యాయ‌‌పర‌‌మైన ఇబ్బందులు ఎదుర‌‌వ‌‌కుండా హైకోర్టు మాజీ జడ్జితో న్యాయ క‌‌మిష‌‌న్​ను ఏర్పాటు చేయాల‌‌ని నిర్ణయించారు. గురువారం కల్లా కమిషన్​ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

ఏకసభ్య న్యాయ క‌‌మిష‌‌న్ 60 రోజుల్లో నివేదిక స‌‌మ‌‌ర్పించాల‌‌ని గ‌‌డువు నిర్దేశించారు. ఎస్సీ జ‌‌నాభా లెక్కల‌‌కు సంబంధించి 2011 జ‌‌నాభా లెక్కల‌‌ను ప‌‌రిగ‌‌ణ‌‌న‌‌లోకి తీసుకోవాల‌‌ని నిర్ణయించారు. ఏక స‌‌భ్య క‌‌మిష‌‌న్‌‌కు అవ‌‌స‌‌ర‌‌మైన స‌‌మాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాల‌‌ని సీఎస్​ను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో వ‌‌ర్గీక‌‌ర‌‌ణ అమ‌‌లు, కులాల రీగ్రూపింగ్‌‌కు సంబంధించి ఇప్పటికే మంత్రివ‌‌ర్గ ఉప సంఘానికి అందిన విన‌‌తుల‌‌పైనా స‌‌మావేశంలో చర్చించారు.

వాట‌‌న్నింటినీ ఏక స‌‌భ్య న్యాయ క‌‌మిష‌‌న్‌‌కు అంద‌‌జేయాల‌‌నే నిర్ణయించారు. ఏకస‌‌భ్య న్యాయ కమిషన్ క్షేత్ర స్థాయి నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీక‌‌రించేందుకు వీలుగా ఉమ్మడి ప‌‌ది జిల్లాల్లో ఒక్కో రోజు ప‌‌ర్యటించేందుకు ఏర్పాటు చేయాల‌‌ని అధికారులను సీఎం ఆదేశించారు. 

ప్లానింగ్ విభాగంతో కలిసి బీసీ సర్వే

బీసీ కులగణనను పూర్తి చేయడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. రాష్ట్రంలో బీసీ సామాజిక‌‌, ఆర్థిక, కుల స‌‌ర్వే ప్రక్రియ‌‌ను వెంటనే ప్రారంభించాల‌‌న్నారు. బీసీ సామాజిక‌‌, ఆర్థిక కుల స‌‌ర్వేపై బీహార్‌‌, క‌‌ర్నాట‌‌క‌‌తో పాటు ప‌‌లు రాష్ట్రాలు అనుస‌‌రించిన విధానాల‌‌ను అధికారులు సీఎంకు వివ‌‌రించారు. ఈ స‌‌ర్వే చేప‌‌ట్టేందుకు అవ‌‌స‌‌ర‌‌మైన యంత్రాంగం త‌‌మ వ‌‌ద్ద లేనందున‌‌, రాష్ట్ర ప్రభుత్వం ఈ విష‌‌యంలో ఓ నిర్ణయం తీసుకోవాల‌‌ని బీసీ క‌‌మిష‌‌న్ చైర్మన్ నిరంజ‌‌న్ కోరారు. ఆయన విజ్ఞప్తి మేర‌‌కు రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని అందుకు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

బీసీ క‌‌మిష‌‌న్‌‌కు, రాష్ట్ర ప్రణాళిక విభాగానికి స‌‌మ‌‌న్వయ‌‌క‌‌ర్తగా ఓ సీనియ‌‌ర్ ఐఏఎస్ అధికారిని నియ‌‌మించాల‌‌ని సీఎస్​ శాంతికుమారిని ఆదేశించారు. 60 రోజుల్లోనే సామాజిక‌‌, ఆర్థిక స‌‌ర్వే పూర్తి చేయాల‌‌ని,  డిసెంబ‌‌ర్​ 9లోపే నివేదిక స‌‌మ‌‌ర్పించాల‌‌న్నారు. ఈ స‌‌ర్వే పూర్తయితే వెంట‌‌నే స్థానిక సంస్థలు ఎన్నిక‌‌లకు వెళ్లొచ్చని సీఎం తెలిపారు. స‌‌మీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ స‌‌ల‌‌హాదారు కె.కేశ‌‌వ‌‌రావు, సీఎం స‌‌ల‌‌హాదారు వేం న‌‌రేంద‌‌ర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యద‌‌ర్శి వి.శేషాద్రి, అడ్వకేట్ జ‌‌న‌‌ర‌‌ల్ సుద‌‌ర్శన్ రెడ్డి, న్యాయ శాఖ కార్యద‌‌ర్శి రేండ్ల తిరుప‌‌తి పాల్గొన్నారు. 

కొత్త ఏడాదిలో కొత్త నోటిఫికేషన్లు, స్థానిక ఎన్నికలు

సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ, బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వేకు రెండు నెలలు గడువు విధించారు. దీంతో ఇప్పటికే ప్రకటించిన జాబ్​ క్యాలెండర్​ను సవరించి.. రానున్న 2025 కొత్త ఏడాదిలో వరుసగా జాబ్​ నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణకు తగ్గట్టు ఉద్యోగాలలో మళ్లీ రిజర్వేషన్లు మారనున్నాయి. ఏకసభ్య న్యాయ కమిషన్​ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే అన్ని శాఖలు.. ఉద్యోగ ఖాళీలపై రిజర్వేషన్​, రోస్టర్​ పాయింట్​ జాబితాను తయారు చేసి  రిక్రూట్మెంట్​ ఏజెన్సీలకు పంపాల్సి ఉంటుంది.

డిసెంబర్​లో నివేదిక ఇస్తే ఆ తర్వాత కొత్త ఏడాదిలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఇక బీసీ సర్వే కూడా డిసెంబర్​ 9 డెడ్​లైన్​ పెట్టుకున్నారు. ఆ తర్వాత అంటే డిసెంబర్​ చివరలో లేదా జనవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్​ చేసింది. దీంతో కొత్త ఏడాదిలో గ్రామాలకు కొత్త సర్పంచ్​లు, ఎంపీటీసీలు రానున్నారు.

ఏకసభ్య న్యాయ క‌‌‌‌మిష‌‌‌‌న్ 60 రోజుల్లో నివేదిక స‌‌‌‌మ‌‌‌‌ర్పించాల‌‌‌‌ని గ‌‌‌‌డువు నిర్దేశించారు. ఎస్సీ జ‌‌‌‌నాభా లెక్కల‌‌‌‌కు సంబంధించి 2011 జ‌‌‌‌నాభా లెక్కల‌‌‌‌ను ప‌‌‌‌రిగ‌‌‌‌ణ‌‌‌‌న‌‌‌‌లోకి తీసుకోవాల‌‌‌‌ని నిర్ణయించారు. ఏక స‌‌‌‌భ్య క‌‌‌‌మిష‌‌‌‌న్‌‌‌‌కు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన స‌‌‌‌మాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాల‌‌‌‌ని సీఎస్​ను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో వ‌‌‌‌ర్గీక‌‌‌‌ర‌‌‌‌ణ అమ‌‌‌‌లు, కులాల రీగ్రూపింగ్‌‌‌‌కు సంబంధించి ఇప్పటికే మంత్రివ‌‌‌‌ర్గ ఉప సంఘానికి అందిన విన‌‌‌‌తుల‌‌‌‌పైనా స‌‌‌‌మావేశంలో చర్చించారు. వాట‌‌‌‌న్నింటినీ ఏక స‌‌‌‌భ్య న్యాయ క‌‌‌‌మిష‌‌‌‌న్‌‌‌‌కు అంద‌‌‌‌జేయాల‌‌‌‌నే నిర్ణయించారు. ఏకస‌‌‌‌భ్య న్యాయ కమిషన్ క్షేత్ర స్థాయి నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీక‌‌‌‌రించేందుకు వీలుగా ఉమ్మడి ప‌‌‌‌ది జిల్లాల్లో ఒక్కో రోజు ప‌‌‌‌ర్యటించేందుకు ఏర్పాటు చేయాల‌‌‌‌ని అధికారులను సీఎం ఆదేశించారు. 

ప్లానింగ్ విభాగంతో కలిసి బీసీ సర్వే

బీసీ కులగణనను పూర్తి చేయడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. రాష్ట్రంలో బీసీ సామాజిక‌‌‌‌, ఆర్థిక, కుల స‌‌‌‌ర్వే ప్రక్రియ‌‌‌‌ను వెంటనే ప్రారంభించాల‌‌‌‌న్నారు. బీసీ సామాజిక‌‌‌‌, ఆర్థిక కుల స‌‌‌‌ర్వేపై బీహార్‌‌‌‌, క‌‌‌‌ర్నాట‌‌‌‌క‌‌‌‌తో పాటు ప‌‌‌‌లు రాష్ట్రాలు అనుస‌‌‌‌రించిన విధానాల‌‌‌‌ను అధికారులు సీఎంకు వివ‌‌‌‌రించారు. ఈ స‌‌‌‌ర్వే చేప‌‌‌‌ట్టేందుకు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన యంత్రాంగం త‌‌‌‌మ వ‌‌‌‌ద్ద లేనందున‌‌‌‌, రాష్ట్ర ప్రభుత్వం ఈ విష‌‌‌‌యంలో ఓ నిర్ణయం తీసుకోవాల‌‌‌‌ని బీసీ క‌‌‌‌మిష‌‌‌‌న్ చైర్మన్ నిరంజ‌‌‌‌న్ కోరారు. ఆయన విజ్ఞప్తి మేర‌‌‌‌కు రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని అందుకు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

బీసీ క‌‌‌‌మిష‌‌‌‌న్‌‌‌‌కు, రాష్ట్ర ప్రణాళిక విభాగానికి స‌‌‌‌మ‌‌‌‌న్వయ‌‌‌‌క‌‌‌‌ర్తగా ఓ సీనియ‌‌‌‌ర్ ఐఏఎస్ అధికారిని నియ‌‌‌‌మించాల‌‌‌‌ని సీఎస్​ శాంతికుమారిని ఆదేశించారు. 60 రోజుల్లోనే సామాజిక‌‌‌‌, ఆర్థిక స‌‌‌‌ర్వే పూర్తి చేయాల‌‌‌‌ని,  డిసెంబ‌‌‌‌ర్​ 9లోపే నివేదిక స‌‌‌‌మ‌‌‌‌ర్పించాల‌‌‌‌న్నారు. ఈ స‌‌‌‌ర్వే పూర్తయితే వెంట‌‌‌‌నే స్థానిక సంస్థలు ఎన్నిక‌‌‌‌లకు వెళ్లొచ్చని సీఎం తెలిపారు. స‌‌‌‌మీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ స‌‌‌‌ల‌‌‌‌హాదారు కె.కేశ‌‌‌‌వ‌‌‌‌రావు, సీఎం స‌‌‌‌ల‌‌‌‌హాదారు వేం న‌‌‌‌రేంద‌‌‌‌ర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యద‌‌‌‌ర్శి వి.శేషాద్రి, అడ్వకేట్ జ‌‌‌‌న‌‌‌‌ర‌‌‌‌ల్ సుద‌‌‌‌ర్శన్ రెడ్డి, న్యాయ శాఖ కార్యద‌‌‌‌ర్శి రేండ్ల తిరుప‌‌‌‌తి పాల్గొన్నారు.

కొత్త ఏడాదిలో  కొత్త నోటిఫికేషన్లు, స్థానిక ఎన్నికలు

సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ, బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వేకు రెండు నెలలు గడువు విధించారు. దీంతో ఇప్పటికే ప్రకటించిన జాబ్​ క్యాలెండర్​ను సవరించి.. రానున్న 2025 కొత్త ఏడాదిలో వరుసగా జాబ్​ నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణకు తగ్గట్టు ఉద్యోగాలలో మళ్లీ రిజర్వేషన్లు మారనున్నాయి. ఏకసభ్య న్యాయ కమిషన్​ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే అన్ని శాఖలు.. ఉద్యోగ ఖాళీలపై రిజర్వేషన్​, రోస్టర్​ పాయింట్​ జాబితాను తయారు చేసి  రిక్రూట్మెంట్​ ఏజెన్సీలకు పంపాల్సి ఉంటుంది. 

డిసెంబర్​లో నివేదిక ఇస్తే ఆ తర్వాత కొత్త ఏడాదిలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఇక బీసీ సర్వే కూడా డిసెంబర్​ 9 డెడ్​లైన్​ పెట్టుకున్నారు. ఆ తర్వాత అంటే డిసెంబర్​ చివరలో లేదా జనవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్​ చేసింది. దీంతో కొత్త ఏడాదిలో గ్రామాలకు కొత్త సర్పంచ్​లు, ఎంపీటీసీలు రానున్నారు.