తిరుమల లడ్డూ వివాదం: సెప్టెంబర్ 30న సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్ పై విచారణ..

తిరుమల లడ్డూ వివాదం: సెప్టెంబర్ 30న సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్ పై విచారణ..

తిరుమల లడ్డూ వివాదం ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఈ అంశంపై ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం ( సెప్టెంబర్ 30, 2024 ) సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

Also Read :- హైడ్రా మీద కేసు నమోదు చేయాలి

ఈ అంశంపై విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. ప్రతిపక్ష వైసీపీ సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తోంది. వైసీపీని టార్గెట్ చేస్తూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కాస్తా దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకు భంగం కలిగించటంతో జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఈ నేపథ్యంలో లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.