మాలల సింహగర్జనకు భారీగా తరలాలి: మాల కులాల యునైటెడ్ ఫోరం పిలుపు

ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్​గ్రౌండ్​లో డిసెంబర్​1న తలపెట్టిన మాలల సింహగర్జనకు పెద్ద ఎత్తున తరలిరావాలని మాల కులాల యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు దయానంద్ పిలుపునిచ్చారు. ప్రతిఒక్క మాల కులస్తుడు కదిలి వస్తేనే గుర్తింపు అని, లేకుంటే అన్యాయం జరుగుతుందని చెప్పారు. మాల మహానాడు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నర్మేట మల్లేశ్​ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్ లో మాలల సింహగర్జనకు సంబంధించిన సదస్సు నిర్వహించారు.

దయానంద్ పాల్గొని మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. హక్కులను సాధించేందుకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తలమల్ల కాశీనాథ్, నరేందర్, మన్నె శ్రీధర్, మంగ, రమేశ్, కృష్ణ, వెంకటేశ్, యాదగిరిరావు, నర్సింగ్ రావు, లక్ష్మణ్ రావు, లోకేశ్, సదానంద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.