![ఢిల్లీలో బీజేపీ ఎలా గెలిచింది.. ఆప్ను ఎలా మట్టికరిపించింది..?](https://static.v6velugu.com/uploads/2025/02/sc-vote-upset-middle-class-freebies-masterstroke-how-bjp-painted-capital-saffron_m5DgW32rBk.jpg)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎట్టకేలకు అధికారం చేజిక్కించుకుంది.. మొత్తం70 అసెంబ్లీ స్థానాలుండగా.. మ్యాజి క్ ఫిగర్ దాటి 47 చోట్ల బీజేపీ గెలుచుకుంది. దశాబ్దానికి పైగా రూలింగ్ లో ఉన్న ఆప్ పార్టీ వరుస విజయాలకు చెక్ పెట్టింది. దాదాపు 27 తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీజేపీ..ఈ ఎన్నికల్లో ఓట్ షేరింగ్ పెంచుకొని ఇంత ఘన విజయం సాధించడానికి దారితీసిన పరిస్థితులేంటి..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారపార్టీ ఆప్ ప్రముఖ నేతలంతా ఓటమి చవిచూశారు. ఢిల్లీలో తిరుగులేని శక్తిగా బీజేపీ పార్టీ విజయం సాధించింది..అధికారాన్ని చేపట్ట బోతోంది.. ఈ క్రమంలో అందరిలో ఒకటే సందేహం..ఢిల్లీలో బీజేపీ పార్టీ విజయ రహస్యం ఏమిటీ అని.
దళితుల ఓట్లు, మధ్యతరగతి ప్రజల ఓట్లు, ఉచితాలపై రివర్స్ ప్లాన్ బీజేపీ ఘన విజయానికి బలమైన, ప్రధానమైన కారణాలు అని తెలుస్తోంది. దీంతో పాటు ఇంత కాలం ఆప్, కాంగ్రెస్ వెనకున్న ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో కూడా బీజేపీ వ్యూహం ఫలించడంతో మ్యాజిక్ ఫిగర్ దాటి అత్యధిక స్థానాలను గెలుచు కున్నదని తెలుస్తోంది.
ఢిల్లీలో బీజేపీకి ఘన విజయం కట్టబెట్టిన ప్రధాన అంశాలు ..
ఎస్సీల ఓట్లు..
దశాబ్దాలుగా అధికార పార్టీ ఆప్కు అండగా ఉన్న ఢిల్లీ స్లమ్ ఏరియాల్లోని ఎస్సీ సామాజిక వర్గం ఈసారి బీజేపీకి జైకొట్టింది. ఉచిత కరెంట్, ఉచిత మంచినీటి సౌకర్యం వంటి వాగ్దానాలతో AAP ప్రభుత్వం దళిత వర్గాన్ని ఆకట్టుకుంది. ఆప్ పార్టీకి అధికారం కట్టబెట్టిన కీలక సెగ్మెంట్లు ఢిల్లీ స్లమ్ ఏరియాల్లో ఉన్నాయి. అయితే ఈసారి బీజేపీ ఢిల్లీ స్లమ్ ఏరియాల్లో దూసుకుపోయింది.
ALSO READ | Delhi Assembly Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్
ఢిల్లీలో స్లమ్ ఏరియాలో దళితులను ఆకట్టుకోవడం బీజేపీ సక్సెస్ అయింది. ఈసారి దాదాపు 20 శాతం దళితుల ఓట్లను చీల్చింది. పక్కా ఇండ్లు, ఆప్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంట్, ఉచిత వాటర్ వంటి పలు రకాల వాగ్దాలను కొనసాగిస్తామని ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయడం బీజేపీకి కలిసొచ్చింది.
ముస్లిం ఓటర్ల ప్రభావం ఉన్న స్థానాల్లోనూ..
ఢిల్లీలో దాదాపు13 శాతం ముస్లిం వర్గాలను ఓట్లున్నాయి. దాదాపు9 నియోజకవర్గాల్లో వీరి ప్రభావ ఉంటుంది.దశాబ్ద కాలంగా ఢిల్లీలో ఆప్ పార్టీతో ఉన్న ముస్లింలు ఘనవిజయాలను అందించారు. అయితే ఈసారి 2020లో అల్లర్ల ప్రభావిత ప్రాంతాలైన ముస్తాఫాబాద్, కరవాల్ నగర్ వంటి కీలక స్థానాల్లో బీజేపీ బిగ్ విక్టరీ సాధించింది. ఈ స్థానాల్లో బలమైన కౌంటర్ పోలరైజేషన్ జరిగినట్టు కనిపిస్తోంది. దీంతోపాటు పూర్వాంచలి ఓట్లు బీజేపీకి భారీగా తరలిపోయాయి.
మధ్య తరగతి సపోర్టు..
ఢిల్లీలో మధ్యతరగతి ఓటర్లు 40 శాతం ఉన్నారు. వీరి ఓటుబ్యాంక్ ఆప్ నుంచి బీజేపీ పెద్ద ఎత్తున చీల్చింది. మధ్యతరగతి ప్రజలు బీజేపీవైపు మళ్లడానికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో మౌలిక సదుపాయాలు హామీలు, 8వ వేతన సంఘం ప్రకటన అటు పేదలు, ఢిల్లీలో దాదాపు 12.75 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునేందుకు ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపు బీజేపీని ఢిల్లీ పీఠం ఎక్కించిన కీలక అంశాల్లో ఉన్నాయి.
ఉచితాలపై బీజేపీ మాస్టర్ ప్లాన్..
2020 నుంచి ఆప్ ప్రభుత్వం ఇచ్చిన ఉచితాలను రేవడీలుగా అభివర్ణించిన బీజేపీకి బీజీపికి ఎదురు దెబ్బతగిలింది.. ఉచితాలవిషయంలో వ్యూహం మార్చిన ప్రధాని మోదీ.. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచితాలు నిలిపివేయమని హామి ఇచ్చింది.
దీంతో పాటు ఆప్ పార్టీ ఇచ్చిన మహిళలకు నెలకు రూ. 2100 ఇస్తామన్న హామీని ఎదుర్కొనేందుకు మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇటువంటి వాగ్దానాలతో ఢిల్లీలోని స్లమ్ ఏరియాల్లో AAP ప్రధాన ఓటు బేస్‌ను BJP చీల్చింది. AAP నుంచి కొంతమేరకు మహిళా ఓటరును చీల్చింది. ఢిల్లీలోని 41 స్థానాల్లో పురుషుల కంటే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్న మహిళా ఓటర్లు, బీజేపీ ఉచిత వాగ్దానాలతో ఈసారి బీజేపీకి జైకొట్టారు.
మోదీ మేనియా..
ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు మరో కారణం మోదీ మేనియా. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే మోదీ ఫేస్ వ్యాల్యూతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బలం సంపాదించుకుంది. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ఓటర్లకు బీజేపీ పెద్ద దిక్కు పీఎం నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేయడం కలిసొచ్చింది. కేజ్రీవాల్ పై వ్యతిరేకత, బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఢిల్లీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రధాని హామీ బాగా పనిచేసింది.
ఆప్ పార్టీపై ఆరోపణలు.. బీజేపీకి బూస్టింగ్
అవినీతి కుంభకోణాలు,షీష్ మహల్ వివాదం కేజ్రీవాల్ షీన్ తగ్గించాయి. కేజ్రీవాల్ సింపుల్ లివింగ్ , హై థింకింగ్ ఇమేజ్‌ను దెబ్బతీశాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం ,కేంద్రం మధ్య నిరంతర గొడవలు బీజేపీకి బూస్టింగ్ ఇచ్చాయని చెప్పొచ్చు.
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ వ్యూహం ఫలించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దశాబ్దానికి పైగా రూలింగ్ లో ఉన్న ఆప్ పార్టీ వరుస విజయాలకు చెక్ పెట్టింది. దాదాపు 27 తర్వాత ఢిల్లీలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పుడు ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా.. ప్రజలకు ఏమేర సంక్షేమం అందనుంది అనేదానిపైనే ఇప్పుడు అందరి దృష్టి.