ప్రీలాంచ్ పేరుతో కోట్లల్లో మోసం.. జీఎస్ఆర్ గ్రూప్​పై కేసు

ప్రీలాంచ్ పేరుతో కోట్లల్లో మోసం.. జీఎస్ఆర్ గ్రూప్​పై కేసు

 బషీర్ బాగ్, వెలుగు: ప్రీ లాంచ్ ఆఫర్​పేరుతో కస్టమర్లను మోసగించిన జీఎస్ఆర్ గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థపై సీసీఎస్​లో కేసు నమోదైంది. గ్రూప్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ జి.శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు బుధవారం సీసీఎస్‌‌‌‌ వద్ద ఆందోళనకు దిగారు. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల పరిధిలోని మోకీల, కొల్లూరు, అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్, యాదాద్రి తదితర ప్రాంతాల్లో విల్లాలు, ప్లాట్‌‌‌‌లకు ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో జీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ప్రచారం చేస్తూ.. సగం ధరకే సేల్ అంటూ.. నమ్మించింది. 

దీంతో కొందరు రూ.కోటి నుంచి రూ. 3 కోట్లు వరకు చెల్లించారు. రెండేండ్లు గడిచినా వెంచర్లు వేయలేదు. డబ్బులు వాపస్​ఇవ్వాలని జీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ చైర్మన్​ను బాధితులు కోరగా స్పందించలేదు. దీంతో 32 మందికిపైగా బాధితులు హైదరాబాద్ సీసీఎస్‌‌‌‌లో కంప్లయింట్ చేశారు.బుధవారం మరోసారి సీసీఎస్ డీసీపీ శ్వేతను కలిసి చెల్లింపు రశీదులు, అగ్రిమెంట్ పత్రాలను అందించారు.