
శ్రీశైలంలో శ్రీస్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనం(స్పర్శ దర్శనం) నకిలీ టికెట్లు కలకలం భక్తులలో కలవర పెడుతుంది. కొందరు వ్యక్తులు నకిలీ టికెట్లు తయారు చేసుకుని భక్తులను మోసం చేసి శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి తీసుకెలుతూ క్యూలైన్లు దాటుకుని లోపలికి ప్రవేశించారు. అయితే గర్భాలయ దర్శనానికి వేళ్లే మెయిన్ గేట్ దగ్గర సిబ్బందికి అనుమానం వచ్చి టికెట్లు పరిశీలించడంతో కేటుగాళ్ల గుట్టు రట్టైంది. సిబ్బందికి అడ్డంగా దొరికిపోయారు. అయితే ఈ నకిలీ టికెట్లు కేటుగాళ్లు మూడు రోజుల కిందటే పట్టుబడ్డారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
శ్రీశైలం దేవస్థానంలో కొందరు కేటుగాళ్లు ఈజీ మనీకి అలవాటు పడి సాహసం చేయరా డింభకా అన్న చందంలా ఏకంగా నకిలీ టికెట్లను ఇంటర్ నెట్లో తయారు చేశారు. ఫేక్ టికెట్లను భక్తులకు ఇచ్చి ఆలయంలోకి దర్శనానికి పంపిస్తుండగా తనిఖీల్లో నకిలీ టికెట్ల బాగోతం బట్టబయలు అయింది. పాత టికెట్లను నెట్లోఎడిటింగ్ చేసి తేదీలను సంవత్సరాన్ని మార్పు చేసి దేవస్థానం అధికారులకు టికేట్లపై అనుమానం రాకుండా సరిదిద్ది మధ్యాహనం సమయంలో స్పర్శదర్శనానికి భక్తులను పంచించే ప్రయత్నం చేశాడు ఓ కేటుగాడు.
Also Read :- మహా కుంభ్ కాదు.. మృత్యు కుంభ్
ఈ నకిలి టికెట్లను స్కాన్ చేస్తే విషయం బయట పడుతుందోమెనన్న అతి తెలివితో ఓ కేటుగాడు భక్తులు వెళ్లే స్పర్శదర్శనం దారిలో కాకుండా దారి మల్లించి ఉచిత దర్శనం క్యూలైన్ల వద్ద నుండి తీసుకుపోయే పని చేశాడు. అక్కడ టికెట్లను తనిఖీ చేస్తోన్న సిబ్బందికి అనుమానం రావడంతో అధికారులకు సమాచారం అందించారు. ఆలయ అధికారులు ఆరా తీయగా టికెట్లు నకిలీవి అని తేలింది.
ఆ టికెట్ల పై దేవస్థానం సీల్ (స్టాంపు)ను, సంతకం ఫోర్జరీ చేయడం ఉద్యోగులలో చర్చనీయాంశంగా మారింది. స్పర్శదర్శనం టికెట్లను అంతర్ జాలంలో ఎడిటింగ్ చేసి భక్తులను తీసుకుపోయే దందా ఎంతకాలం నుండి సాగుతుందో అధికారుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. ఈ విషయంపై దేవస్థానం అధికారులు జరిగిన సంఘటనపై క్యూలైన్ల ఇంచార్జ్ ఏఈవో స్వాములు పర్యవేక్షకురాలు హిమబిందు గోప్యంగా విచారణ చేసి ఈవోకు సమాచారం ఇచ్చారు. పర్యవేక్షకురాలు హిమబిందు, ఏఈఓ స్వాములు నకిలి టికెట్లను పరిశీలించారు. నకిలి టికెట్లని తెలడంతో ఈఓ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ నకిలి టికెట్లు దందా ఎంత కాలం నుండి జరుగుతుందోనని అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై దేవస్థానం అధికారులు భాధ్యులైన వారిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాల్సి ఉంది.