స్కామ్ ప్లాన్ చంద్రబాబుదే : ఏపీ ఏఏజీ సుధాకర్ రెడ్డి

స్కామ్ ప్లాన్ చంద్రబాబుదే :  ఏపీ ఏఏజీ సుధాకర్ రెడ్డి

స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ స్కామ్‌‌ చాలా స్కిల్‌‌ ఫుల్‌‌గా చేసి, ప్రభుత్వ నిధులను దోచుకు న్నారని ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్‌‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌‌‌‌రెడ్డి తెలిపారు. ఈ దోపిడీ ప్లాన్ చంద్రబాబుదేనని చెప్పారు. గురువారం ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్‌‌, ఎస్పీ ఫకీరప్పతో కలిసి హైదరాబాద్‌‌లోని లేక్‌‌ వ్యూ గెస్ట్‌‌ హౌస్ లో సుధాకర్‌‌‌‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీ యువతలో స్కిల్స్ పెంచేందుకు సీమెన్స్ కంపెనీ ముందుకొచ్చిందని, ఇందుకోసం రూ.3,300 కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు ప్రభుత్వం ఓ జీవో విడుదల చేసింది. 

ఇందులో 90% సీమెన్స్‌‌, 10% ప్రభుత్వం భరించాలని ఎంవోయూ చేసుకున్నారు. కానీ సీమెన్స్ కంపెనీ నుంచి ఒక్క రూపాయి విడుదల కాకముందే, ప్రభుత్వ వాటా కింద రూ.371 కోట్లు(జీఎస్టీతో కలిపి) విడుదల చేశారు. ఆ నిధులను సీమెన్స్ తరఫున డిజైన్ టెక్​ను థర్డ్ పార్టీగా చూపించి, ఆ కంపెనీ అకౌంట్లలోకి డబ్బు ట్రాన్స్‌‌ఫర్ చేశారు. ఈ కంపెనీ రూ.58.8 కోట్లతో సీమెన్స్ నుంచి ఓ సాఫ్ట్‌‌వేర్ కొను గోలు చేసింది. మిగతా రూ.241 కోట్లను షెల్‌‌ కంపె నీల్లోకి బదిలీ చేసింది” అని సుధాకర్‌‌ ‌‌రెడ్డి వివరించారు.