యూపీఐ రీఫండ్ స్కామ్ కిరాణా స్టోర్‌లలో చెల్లింపులు మొదలు విమాన టిక్కెట్‌లను బుక్ చేయడం వరకు యూపీఐని ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌లను ఉపయోగించి ప్రజలను మోసగించడానికి స్కామ్‌స్టర్లు కొత్త పద్ధతులను మొదలుపెట్టారు. ఇటువంటి స్కాముల్లో ఒకటి యూపీఐ రీఫండ్ స్కామ్. మోసగాళ్ళు కాల్ చేసి మీకు కొంతమొత్తం తిరిగి చెల్లించాల్సి ఉందని చెబుతారు. మనల్ని నమ్మించడానికి అధికారులు ఉపయోగించే పదాలను వాడుతారు. బ్యాంకులు, ఆదాయపు పన్ను శాఖ, అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ–కామర్స్ వెబ్‌సైట్ల అధికారుల వలె నటిస్తారు. వీళ్లు మీకు మెసేజ్‌ద్వారా ఒక లింక్‌ను పంపుతారు. డబ్బు వాపసు తీసుకోవడానికి మీరు దాని ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని పట్టుబడతారు. రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ ఖాతా వివరాలు లేదా యూపీఐ ఐడీ పిన్ని ఇవ్వాలి. ఇలా చేస్తే డబ్బు తక్షణమే మీ ఖాతాలో జమ అవుతుందని అంటారు. వివరాలు ఇచ్చిన వెంటనే, మీ ఖాతా నుంచి డబ్బు పోతుంది. కాబట్టి బ్యాంక్ ఖాతా నంబర్లు లేదా యూపీఐ పిన్‌ల వంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.
ఓటీపీ స్కామ్
ఈ రకమైన మోసం ఎలా ఉంటుందంటే... నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుంచి లోన్ లేదా క్రెడిట్ లిమిట్ పెంపును ఆఫర్చేస్తూ నకిలీ మెసేజ్‌ను పంపుతారు. ఆఫర్ పొందడానికి మీ ఆర్థిక వివరాలను షేర్ చేయమని అడుగుతారు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ లేదా పిన్‌లను ఇవ్వమని కోరుతారు. మీరు ఓటీపీ లేదా పిన్ని ఇచ్చిన మరుక్షణం మోసగాళ్ళు మీ బ్యాంక్ ఖాతాల నుంచి అనధికారిక లావాదేవీలను నిర్వహిస్తారు. ఒక నిమిషంలోనే మీ ఖాతా నుంచి భారీ మొత్తంలో డబ్బు డెబిట్ అయినట్లు మెసేజ్వస్తుంది. తక్కువ లేదా ఎటువంటి రిస్క్ లేకుండా అధిక రాబడికి హామీ ఇచ్చే ప్రతిపాదనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూపీఐ ద్వారా డబ్బును పొందడానికి ఎప్పుడూ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవద్దు. పిన్ లేదా ఓటీపీని ఇవ్వకూడదు.
నకిలీ డెలివరీ స్కామ్
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా వంటి ఈ–-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఓటీపీ -ఆధారిత డెలివరీ విధానాలను ఉపయోగిస్తాయి. ఫలితంగా మీరు ఆర్డర్ చేసిన వస్తువులు సురక్షితంగా మీ చేతికి చేరేలా చూస్తాయి. మీకు ప్యాకేజీని అందజేసే డెలివరీ ఏజెంట్‌కు మీరు ఓటీపీని ఇవ్వాలి. బ్యాంకు ఖాతాల్లోని డబ్బును దొంగిలించేందుకు మోసగాళ్లు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. స్కామ్‌స్టర్లు తరచుగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వారిని లక్ష్యంగా చేసుకుంటారు. ఈ–కామర్స్ వెబ్‌సైట్‌లు లేదా పోస్టల్ డిపార్ట్‌మెంట్ డెలివరీ ఏజెంట్లమంటూ మీ ఇంటి వద్దకు వస్తారు. ‘పే -ఆన్ -డెలివరీ’ ప్యాకేజీ కోసం డబ్బు అడుగుతారు. మీరు అలా చేయడానికి అంగీకరిస్తే, డెలివరీ కోసం ఓటీపీని రూపొందించడానికి మీ ఫోన్‌కి లింక్‌ను పంపుతారు. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే మీ ఫోన్, బ్యాంక్ ఖాతాల వంటి వాటికి యాక్సెస్‌ను పొందుతారు. మీరు ప్యాకేజీకి డబ్బు చెల్లించడానికి నిరాకరిస్తే, పార్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు చెబుతారు. రద్దు చేయడానికి కూడా మీ ఫోన్‌కి లింక్‌ను పంపవచ్చు. ఇలాంటి లింక్‌పై క్లిక్ చేసినా ప్రమాదమే! ఇలాంటి ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే.. మీరు పార్సిల్‌ను ఆర్డర్ చేశారో లేదో తెలుసుకోవడానికి సంబంధిత యాప్‌ను చెక్ చేయాలి. డెలివరీ గురించి దాని గురించి ఏదైనా మెసేజ్ వచ్చిందో లేదో చెక్ చేయాలి. ఈ–-కామర్స్ సైట్‌లు డెలివరీకి ముందే ఏజెంట్ ఫోన్ నంబరు వివరాలతో ఎస్ఎంఎస్లు పంపుతాయి. ఓటీపీని షేర్ చేయడానికి ముందు, డెలివరీ ఏజెంట్ గుర్తింపును వెరిఫై చేయండి. సంబంధిత నంబరుకు ఫోన్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది.
ఇతర స్కామ్‌లు..
తాము ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయకపోతే మీ కరెంటు కనెక్షన్ త్వరలో డిస్కనెక్ట్ అవుతుందని కొందరు అనధికార నంబర్ల తో ఫోన్ చేసి బెదిరిస్తారు. లేదా ఎస్ఎంఎస్లు పంపుతారు. దీనిని కరెంట్స్కామ్ అంటున్నారు. కరెంటు బోర్డులు అధికారిక నంబర్ల నుంచి ఎస్ఎంఎస్ పంపుతారు. ఇదిలా ఉంటే, కరోనా ప్రారంభమైన తర్వాత జాబ్ స్కామ్‌లు ఎక్కువయ్యాయి. వీటిలో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్. మోసగాళ్ళు మీకు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని అందిస్తామని ఆశ చూపుతారు. ఖాళీగా ఉన్నప్పుడే చాలా డబ్బు సంపాదించవచ్చని ఊరిస్తారు. ఇవన్నీ ఉత్తివే. వీరి మెయిళ్లను, మెసేజ్‌లను నమ్మకూడదు. మరొక స్కామ్ జ్యూస్ జాకింగ్. మోసగాళ్ళు ఫోన్ నుంచి డేటాను దొంగిలించడానికి బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ పోర్ట్‌లను వాడుతున్నారు. మీ ఫోన్‌ను హ్యాక్ చేయడానికి బ్యాంక్ వివరాలు లేదా యూపీఐ పాస్‌వర్డ్‌ల వం టి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి ఈ ఛార్జింగ్ స్టేషన్‌లలో హానికర హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఇంకో స్కామ్.. స్టాక్ మార్కెట్స్కామ్. అధిక రాబడిని ఇస్తామనే పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ డబ్బును 3 నెలల్లో రెట్టింపు చేస్తామంటూ మీరు తరచుగా మీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో ప్రకటనలను చూస్తుంటారు. ఇవన్నీ దాదాపుగా నకిలీవే.
ఆన్‌లైన్ స్కామ్‌ల నుంచి
మనల్ని మనం రక్షించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి. సైబర్క్రిమినల్స్ తాజా పద్ధతులు, ట్రిక్‌ల గురించి తెలియకపోతే సులభంగా వారి ఉచ్చులో పడవచ్చు. ఫలితంగా సమయం, డబ్బు వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోతాం. ఆన్‌లైన్‌లో పెరుగుతున్న కొన్ని రకాల స్కామ్‌లు, వాటి నుంచి మనల్ని మనం రక్షించుకునే మార్గాలను తెలుసుకుందాం.