
బషీర్‌బాగ్, వెలుగు: రెండు గంటల్లో రూ.15 లక్షల లోన్ ఇస్తామంటూ సిటీకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు చీట్ చేశారు. అతని నుంచి రూ.45 లక్షలు కొట్టేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి(59)కి ఇటీవల ఆర్య వైశ్య బ్యాంక్ వాట్సాప్ గ్రూప్ పేరిట స్కామర్ల నుంచి మెసేజ్వచ్చింది. అందులో మహాలక్ష్మి ఫైనాన్స్ నుంచి రెండు గంటల్లో రూ.15 లక్షల లోన్ ఇస్తామని ఉంది. నిజమేనని నమ్మిన ప్రైవేట్ ఉద్యోగి అందులో పేర్కొన్న ఫోన్‌నంబర్‌కు కాల్చేయగా సిబిల్స్కోర్చాలా తక్కువగా ఉంది, దానితో సంబంధం లేకుండా లోన్ప్రాసెస్చేయాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని స్కామర్లుచెప్పాడు. అందుకు ఒప్పుకోవడంతో గురుకృప ట్రేడర్స్ పేరుతో ఉన్న యూపీఐ క్యూఆర్‌కోడ్‌ను స్కామర్పంపించాడు.
లోన్ వస్తుందనే ఆలోచనలో ప్రైవేట్ ఉద్యోగి స్కామర్ అడిగినంత డబ్బు పంపించాడు. తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, చెక్లీఫ్ ను షేర్చేశాడు. లోన్ప్రాసెసింగ్ విషయాన్ని సదరు ప్రైవేట్ ఉద్యోగి తన సోదరుడికి చెప్పగా, ఇదంతా స్కామ్ అని.. పంపిన వివరాలను వెంటనే డిలీట్చేయమనడంతో మొత్తం డిలీట్చేశాడు. ఆ వెంటనే స్కామర్కాల్చేసి లోన్ప్రాసెసింగ్లో ఉందని, పంపిన వివరాలు ఎందుకు డిలీట్చేశారని దబాయించాడు. డిలీట్చేసినందుకు ఫైన్చెల్లించాల్సి ఉంటుందని మరో యూపీఐ క్యూఆర్కోడ్పంపించాడు.
ఫైన్‌కింద కొంత డబ్బు వసూలు చేశాడు. తర్వాత ప్రైవేట్ ఉద్యోగి ఎస్బీఐ అకౌంట్ లో తగినంత బ్యాలెన్స్ లేదని మరోసారి ఫైన్వసూలు చేశాడు. ఇలా మొత్తం 25 సార్లు ఫైన్ల పేరిట డబ్బు కొట్టేశాడు. లోన్ తోపాటు చెల్లించిన ఫైన్లు మొత్తం తిరిగి వస్తాయని చెప్పడంతో నిజమేనని నమ్మిన ప్రైవేట్ఉద్యోగి అప్పు చేసి మరీ ఫైన్లు కట్టాడు. బ్యాంక్ హెడ్ ఆఫీసులో లోన్ప్రాసెస్ లో ఉందని, మరికొంత డబ్బు కట్టాలని తాజాగా స్కామర్ ఒత్తిడి చేశాడు. అడిగినంత ఇవ్వకపోతే లోన్ రిజెక్ట్ చేస్తామని బెదిరించాడు. చివరికి ఇదంతా స్కామర్ల పని అని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను మొత్తం రూ.44లక్షల 83 వేలు పోగొట్టుకున్నానని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.