ఎస్బీఐ కాల్ సెంటర్ పేరుతో మోసాలు

ఎస్బీఐ కాల్ సెంటర్ పేరుతో మోసాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేసి.. కోట్లు కాజేశారని తెలిపారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. 14మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ ముఠా SBI బ్యాంకు ఏజెంట్ల నుంచి ఖాతాదారుల సమాచారం తీసుకొని మోసం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన ముఠా సభ్యులపై దేశవ్యాప్తంగా 209 కేసులు ఉన్నాయన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.