లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్( Shankar) తెరకెక్కిస్తున్న మూవీ ‘ఇండియన్ 2’. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను..శంకర్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ మూవీకి అడ్వాన్స్‌డ్ విజువల్ కోసం "డి-ఏజింగ్ టెక్నాలజీ" VFX వర్క్ లో బిజీగా ఉన్నారు. అమెరికా లాస్ ఏంజిల్స్ లోని ప్రముఖ సంస్థ లోలా (Lola VFX) ఈ మూవీకి వీఎఫ్‌ఎక్స్ అందించనుంది. డైరెక్టర్ శంకర్ మారుతున్న జనరేషన్ కు తగ్గట్లు టెక్నాలజీని తీసుకురావడంలో అపార మేధావి. అందులో భాగంగానే VFX స్టూడియోలో అక్కడ జరిగే వర్క్ ను తదేకంగా చూస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రికార్డ్స్ సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు సినీ క్రిటిక్స్.
లోలా VFX సంస్థ మిషన్ ఇంపాసజిబుల్, 300, అవతార్, కెప్టెన్ మార్వెల్, బ్లాక్ పాంథర్, జురాసిక్ వరల్డ్ వంటి హాలీవుడ్ హిట్ చిత్రాలకు విజువల్స్ అందించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
శంకర్ ..హీరో కమల్ హాసన్ కాంబో లో వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్నదే ‘ఇండియన్ 2’. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ మూవీ నుండి మరిన్ని వివరాలు ప్రకంటించే అవకాశం ఉంది.