తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోనే 

 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోనే 
  • నల్ల చట్టాలను రద్దు చేయించాం
  • సికార్​ఎంపీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు అమ్రరాం

జనగామ అర్బన్, వెలుగు:  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోనే  కేంద్రంలో ప్రధాని మోదీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పార్లమెంట్​లో రద్దు చేయించగలిగామని సీకార్​ఎంపీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు అమ్రరాం పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రైతాంగ పోరాట పక్షోత్సవాల ముగింపు బహిరంగ సభను  జనగామ జిల్లా కేంద్రంలో  సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సికార్​ఎంపీ అమ్రరాం హాజరై మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో తెలంగాణ సాయుధ పోరాటం లిఖించబడిందని పేర్కొన్నారు.

ఎర్రజెండా రాజ్యం వస్తేనే దేశంలో ప్రజల బతుకులు మారుతాయని, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే మరిన్ని ఉద్యమాలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్​సాయుధ పోరాటాన్ని వక్రీకరించడం సిగ్గుచేటని సీపీఎం సభ్యుడు ఎండీ అబ్బాస్​మండిపడ్డారు. 

ఈ సభలో గంగసాని రఘుపాల్, ఎం. శోభన్​నాయక్​, శ్రీకాంత్, జోగు ప్రకాశ్, రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, బూడిద గోపి, బొట్ల శేఖర్, సుంచు విజేందర్, బోడ నరేందర్, యాకయ్య, ధర్మభిక్షం తదితరులు పాల్గొన్నారు.