నిప్పుతో చెలగాటం ఆడొద్దన్నది పెద్దల మాట. ఈ రోజుల్లో వైరల్ అవ్వడం కోసం, ఓవర్ నైట్ ఫేమ్ సాధించటం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు యువత. రీల్స్ పిచ్చితో ప్రాణాలు పోగుట్టుకున్నవారిని చాలా మందిని చూశాం.. వైరల్ అవ్వడం కోసం పిచ్చి పనులు చేస్తుంటారు చాలా మంది. ఈ కోవకు చెందినదే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ఓ వ్యక్తి గ్యాస్ స్టవ్ మీద పాలు కాస్తుండగా మరొక వ్యక్తి స్టవ్ మీద డియోడరెంట్ స్ప్రే కొడతాడు... అంతే, ఒక్కసారిగా మంట ఎగసిపడుతుంది.
గ్యాస్ తక్కువగా ఉందంటూ క్యాప్షన్ తో ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు సదరు నెటిజన్. 93వేల లైక్స్ తో ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోకి కామెంట్ల రూపంలో కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్స్. నిప్పుతో చెలగాటం, చావుతో సహవాసం అంటే ఇదే అని.. పిచ్చి పరాకాష్టకు చేరితే ఇలాంటి ఐడియాలు వస్తాయని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.