రాకాసి బల్లి.. పేరు వింటుంటేనే భయంగా ఉంది కదూ.. ఇక అదే గనక ఇళ్లలోకి వస్తే.. ఆ ఊహే భయంకరంగా ఉంది. ముంబైలో బుదవారం ( సెప్టెంబర్ 26, 2024 ) రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అయ్యింది. ఈ క్రమంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో ఓ రాకాసి బల్లి అపార్టుమెంటులోకి చొరబడి దర్జాగా తిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అపార్టుమెంటు కాంపౌండ్ లో తిరుగుతున్న రాకాసి బల్లిని ఓ వ్యక్తి తన బాల్కనీ నుండి వీడియో తీశాడు.
Also Read :- పోలీస్ బందోబస్త్తో మూసీ ఆక్రమణలకు మార్కింగ్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి ఎలాంటి సమాచారం లేదు. రాకాసి బల్లి గురించి అటవీ అధికారులకు సమాచారం అందించారా లేదా, బల్లి సురక్షితంగా అడవికి తరలించారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే, అది విషజంతువు కాదని, దాని వల్ల మనుషులకు ఎలాంటి హాని ఉండదని.. అటవీ అధికారులకు సమాచారం అందించి సురక్షితంగా అడవికి తరలించాలని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.