సింగరేణి నుంచి మరో నోటిఫికేషన్ 327 జాబ్స్

సింగరేణి సంస్థలో  గతనెల 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇక తాజాగా మరో నోటిఫికేషన్ ఆ సంస్థలో ఉద్యోగాల భర్తీకి విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మరో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఈఅండ్‌ఎం, సిస్టమ్స్)-49 పోస్టులు, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ-100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్, ఎలక్ట్రికల్)-33 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1లో 47 పోస్టులు, ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీలో 98 పోస్టులు ఉన్నాయి. 

ఆసక్తి, విద్యా అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే  4 వరకు  ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు గరిష్ఠంగా 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్లపాటు వయో సడలింపు వర్తిస్తుంది. సంస్థ ఉద్యోగులకు ఎలాంటి వయోపరిమితి వర్తించదు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. జనరల్ అభ్యర్థులకు రూ.1000 ల ఫీజు ఉండాగా..  ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులకు రూ.100 మాత్రమే ఉంది. రిటన్ ఎగ్జామ్ లో  మార్కులు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.