
- శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటికే పనులు షురూ
- మిగిలిన ఏరియాల్లోనూ ఏర్పాటుకు సన్నాహాలు
- పర్యాటక రంగ అభివృద్ధికి సింగరేణి ప్రోత్సాహం
- కేంద్ర పర్యావరణ ఆదేశాలను అమలు చేస్తూ..
మూసివేసిన గనుల పరిసరాల్లో గ్రీనరీ పెంపొందించాలనే కేంద్ర పర్యావరణశాఖ ఆదేశాలను సింగరేణి అమలు చేస్తుంది. ఇటీవల శ్రీరాంపూర్ఏరియాలో మూసివేసిన ఆర్కే–8 మైన్‌ను నేషనల్కోల్కంట్రోల్ఓఎస్ డీ సందీప్ ఎస్పరాంజపే సందర్శించారు. గని పరిసర ప్రాంతాల్లో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ పనులు పరిశీలించారు. సింగరేణివ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఎకో పార్క్‌లు ఏర్పాటైతే కోల్‌బెల్ట్ కు త్వరలోనే పర్యాటక శోభ రానుంది.
కోల్‌బెల్ట్, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు సింగరేణి మరో ముందడుగు వేసింది. మూసివేసిన బొగ్గు గనుల ప్రాంతాల్లో ఎకో పార్కుల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఎత్తైన మట్టి దిబ్బలు, లోతైనా క్వారీలు, బొగ్గు, దుమ్ము, ధూళి.. బొగ్గు గనుల ప్రాంతాల్లో ఇవే గుర్తొస్తాయి. ఇప్పుడు అందమైన వనాలు, ఔషధ మొక్కలు, టూరిస్టులకు ఆహ్లాదం పంచేందుకు సింగరేణి చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఎకో పార్కుల అభివృద్ధిని చేపట్టింది. ఇప్పటికే కొత్తగూడెంలో ఏర్పాటు చేసింది. రెండో పార్కును మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ఏరియాలో ప్రారంభించింది.
వచ్చే రెండు, మూడేండ్లలో అంతటా..
రెండు, మూడు ఏండ్లలో ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో వీటిని అందుబాటులోకి తేనుంది. కేంద్ర పర్యావరణశాఖ రూల్స్ మేరకు మూసివేసిన గనులు, ఓపెన్కాస్ట్ఓబీ యార్డుల వద్ద కొన్నాళ్లు గా సింగరేణి భారీగా మొక్కలు నాటి అడవులను పెంచుతుంది. వీటిని పూర్తి స్థాయిలో అందుబాటు లోకి తెచ్చాక టూరిజం శాఖకు ఇచ్చే యోచనలో ఉంది. తద్వారా టూరిజం అభివృద్ధితో పాటు స్థానిక సింగరేణి కార్మిక, కార్మికేతర కుటుంబాలకు ఆహ్లాదం అందించనుంది. ఇందుకు ప్రభుత్వం కూడా ఆసక్తి చూపడంతో సింగరేణి పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం అందించనుంది.
ఎకో పార్కు పనులు షురూ..
సింగరేణి రూ.3కోట్లతో భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఎకో పార్కును ఏర్పాటు చేసింది. దానిపక్కనే గౌతంఖని ఓపెన్‌కాస్ట్ ఓవర్బర్డెన్మట్టి దిబ్బలపై పెంచిన వనంలో ఎకో అడ్వెంచర్పార్క్గాను మార్చనుంది. మరోవైపు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో రెండో ఎకో పార్క్ పై దృష్టి పెట్టింది. దీనికి గతేడాది ఫిబ్రవరి17న కేంద్ర బొగ్గుశాఖ కార్యదర్శి అమ్రిత్లాల్మీనా, సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్శంకుస్థాపన చేశారు. కానీ పనుల్లో జాప్యం జరిగింది. ఇటీవల పార్క్ నిర్మాణ పనులను మళ్లీ షురూ చేసింది.
నేషనల్హైవే పక్కన ఓపెన్‌కాస్ట్ మైన్‌కు వెళ్లే రోడ్డులో 6 ఎకరాల్లో నిర్మిస్తుండగా ఇందులో వివిధ వృక్షజాతులు, ఔషధ వనాలు, రకరకాల పండ్ల మొక్కలను పెంచడంతో పాటు వాకింగ్‌ట్రాక్, బట్టర్ఫ్లై గార్డెన్వంటివి అందుబాటులోకి తీసుకురానుంది. పార్క్మధ్యలో రెండు నీటి కుంటలను, బర్డ్వాచ్సెంటర్, వ్యూ పాయింట్, కెఫెటేరియాలు కూడా ఏర్పాటు చేసే చాన్స్ ఉంది. ప్రస్తుతం స్థలాన్ని చదును చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించే పనులు చేపట్టింది.