ఐపీఎల్‌‌‌‌–17లో 21 మ్యాచ్‌‌‌‌ల షెడ్యూల్‌‌‌‌ రిలీజ్‌‌‌‌

ఐపీఎల్‌‌‌‌–17లో 21 మ్యాచ్‌‌‌‌ల షెడ్యూల్‌‌‌‌ రిలీజ్‌‌‌‌
  • జనరల్‌‌‌‌ ఎలక్షన్స్‌‌‌‌ను బట్టి మిగతా షెడ్యూల్‌‌‌‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–17కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్‌‌‌‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. మార్చి 22 నుంచి ఏప్రిల్‌‌‌‌ 7 వరకు మొత్తం 21 మ్యాచ్‌‌‌‌ల షెడ్యూల్‌‌‌‌ను ఖరారు చేసింది. సార్వత్రిక ఎన్నికలను బట్టి మిగతా మ్యాచ్‌‌‌‌ల వివరాలను ప్రకటించనున్నారు. ఫార్మాట్‌‌‌‌ ప్రకారం 10 జట్లను రెండు గ్రూప్‌‌‌‌లుగా విభజించారు. గ్రూప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో ప్రతి టీమ్‌‌‌‌ 14 మ్యాచ్‌‌‌‌లు ఆడనుంది.

హోమ్​ అండ్‌‌‌‌ అవే పద్ధతిలో మ్యాచ్‌‌‌‌లు జరగనున్నాయి. మార్చి 22న డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ చెన్నై.. రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌‌‌‌తో మెగా లీగ్‌‌‌‌కు తెరలేవనుంది. ఈ ఒక్క మ్యాచ్‌‌‌‌ మాత్రం 8 గంటలకు మొదలుకానుండగా, మిగతా నైట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఏడున్నరకు, మధ్యాహ్నం మ్యాచ్‌‌‌‌లు మూడున్నరకు ప్రారంభమవుతాయి. మే 26న ఫైనల్‌‌‌‌ జరిగే అవకాశం ఉంది. ప్రారంభ షెడ్యూల్‌‌‌‌లో 4 డబుల్‌‌‌‌ హెడర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఉన్నాయి. 

ఐపీఎల్‌‌‌‌‑17 షెడ్యూల్‌‌‌‌ (21 మ్యాచ్‌‌‌‌లు)


మార్చి 22    చెన్నై X బెంగళూరు    చెన్నై
మార్చి 23    పంజాబ్‌‌‌‌ X ఢిల్లీ    మొహాలీ
మార్చి 23    కోల్‌‌‌‌కతా X హైదరాబాద్‌‌‌‌    కోల్‌‌‌‌కతా
మార్చి 24    రాజస్తాన్‌‌‌‌ X లక్నో    జైపూర్‌‌‌‌
మార్చి 24    గుజరాత్‌‌‌‌ X ముంబై    అహ్మదాబాద్‌‌‌‌
మార్చి 25    బెంగళూరు X పంజాబ్‌‌‌‌    బెంగళూరు
మార్చి 26    చెన్నై X గుజరాత్‌‌‌‌    చెన్నై
మార్చి 27    హైదరాబాద్‌‌‌‌ X ముంబై    హైదరాబాద్‌‌‌‌
మార్చి 28    రాజస్తాన్‌‌‌‌ X ఢిల్లీ    జైపూర్‌‌‌‌
మార్చి 29    బెంగళూరు X కోల్‌‌‌‌కతా    బెంగళూరు
మార్చి 30    లక్నో X పంజాబ్‌‌‌‌    లక్నో
మార్చి 31    గుజరాత్‌‌‌‌ X హైదరాబాద్‌‌‌‌    అహ్మదాబాద్‌‌‌‌
మార్చి 31    ఢిల్లీ X చెన్నై         విశాఖపట్నం
ఏప్రిల్‌‌‌‌ 1    ముంబై X రాజస్తాన్‌‌‌‌    ముంబై
ఏప్రిల్‌‌‌‌ 2     బెంగళూరు X లక్నో    బెంగళూరు
ఏప్రిల్‌‌‌‌ 3    ఢిల్లీ X కోల్‌‌‌‌కతా    విశాఖపట్నం
ఏప్రిల్‌‌‌‌ 4    గుజరాత్‌‌‌‌ X పంజాబ్‌‌‌‌     అహ్మదాబాద్‌‌‌‌
ఏప్రిల్‌‌‌‌ 5    హైదరాబాద్‌‌‌‌ X చెన్నై    హైదరాబాద్‌‌‌‌
ఏప్రిల్‌‌‌‌ 6    రాజస్తాన్‌‌‌‌ X బెంగళూరు    జైపూర్‌‌‌‌
ఏప్రిల్‌‌‌‌ 7    ముంబై X ఢిల్లీ    ముంబై
ఏప్రిల్‌‌‌‌ 7    లక్నో X గుజరాత్‌‌‌‌    లక్నో