
మంత్రి హరీష్ రావు 2023 జూన్ 30 శుక్రవారం రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. మంత్రి షెడ్యూల్ ఇలా ఉంది.
పర్యటన షెడ్యూల్
- 2023 జూన్ 30న శుక్రవారం ఉదయం11.30 గంటలకు కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొంటారు.
- అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం జిల్లాలో నూతనంగా మంజూరయిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఆయన సందర్శింస్తారు
- ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం పట్టణంలో పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొంటారు.