
కోల్ బెల్ట్, వెలుగు: మందమర్రి మండలం అందుగులపేట 33కేవీ సబ్‌స్టేషన్‌లోని ఫీడర్‌కు రిపేర్లు చేయనున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్సప్లై బంద్ చేస్తామని ట్రాన్స్‌కో మంచిర్యాల రూరల్ఏడీఈ రాచకొండ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, అందుగులపేట, పులిమడుగు, బొక్కలగుట్ట గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.