వికారాబాద్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం ఎంపీడీవోలు, తహసీల్దార్లతో టెలీ
కాన్ఫరెన్స్నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎంపీడీవో, తహసీల్దార్లు..మున్సిపల్ కమీషనర్లతో సమన్వయం చేసుకొని గురువారంలోగా లిస్ట్ రెడీ చేయాలన్నారు.
గ్రామ సభలు, వార్డు సభలకు టీమ్స్ ఏర్పాటు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలన్నారు. రుణ మాఫీ, గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాల గురించి గ్రామాల వారీగా, వార్డుల వారీగా లిస్ట్ రెడీ చేయాలన్నారు.