మిడ్జిల్, వెలుగు: తొమ్మిదేండ్లుగా పత్తా లేని పథకాలన్నీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుర్తొస్తున్నాయని టీపీసీసీ సెక్రటరీ అనిరుధ్‌రెడ్డి విమర్శించారు. ప్రజాహిత పాదయాత్ర బుధవారం మండలంలోని మల్లాపూర్, బోయిన్ పల్లి, మిడ్జిల్ గ్రామాల్లో నిర్వహించారు. మల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. బోయిన్ పల్లిలో ఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడేండ్లుగా రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. గ్రామ స్థాయి నుంచి బీఆర్ఎస్ లీడర్లు మట్టి, ఇసుక, భూ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. తంగెళ్ల అల్వాల్ రెడ్డి, ఎంపీటీసీ గౌస్, రబ్బానీ, సంపత్ కుమార్, పర్వతాలు, మల్లికార్జున్ రెడ్డి, ఉస్మాన్, సత్తయ్య, అశోక్, హరి గౌడ్ పాల్గొన్నారు.