TDP నేత ఇంటి ముందు స్కూల్ బ్యాగ్ : బాంబుల కలకలం

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని టీడీపీ నాయకుడి ఇంటి ఆవరణలో బాంబు పెట్టారనే ప్రచారం స్థానికంగా అలజడి రేపింది. కోస్గిలో టీడీపీ నాయకుడు నడిగేని అయ్యన్న ఇంటి ముందు కాంపౌండ్ లో ఓ కొత్త స్కూల్ బ్యాగ్ పడి ఉంది. ఎన్నికల టైమ్ కావడంతో.. బ్యాగ్ లో ఎవరో బాంబ్ లు పెట్టి అక్కడ పెట్టి ఉంటారని అనుమానపడ్డారు. ఆ బ్యాగ్ ను ఎవరూ తీసే ప్రయత్నం చేయలేదు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.

కోస్గి ఎస్సై శ్రీనివాసులు… తన టీమ్ తో అక్కడకు చేరుకున్నారు. అనుమానాస్పద బ్యాగ్ ను నీళ్లున్న బకెట్ లో వేసి… పోలీస్ స్టేషన్ లోని ఆవరణకు తీసుకెళ్లారు. బాంబ్ డిస్పోజ్ టీమ్ తో తనిఖీలు చేయించి అందులో ఏమీ లేదని తేల్చారు.

మంత్రాలయంలోనే రెండు వారాల కిందట… ఖగ్గిల్లు గ్రామంలో టీడీపీ,వైసీపీ నేతల మధ్య ఫైట్ జరిగింది. ఈ ఘర్షణలో గన్ మెన్ ఫైరింగ్ కలకలం రేపింది. నాయకులు, పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.