గురువారం(నవంబర్ 14) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పిల్లలతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కొక్క ఏరియాకు బస్సును పోనిస్తూ పిల్లలను ఎక్కించుకుంటున్నారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 15 మంది పిల్లలు ఉన్నారు.
ఇంజిన్ నుండి పొగలు రావడాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్.. హుహుటీన పిల్లలందరినీ అప్రమత్తం చేసి వారి ప్రాణాలు కాపాడాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో ఉన్న పిల్లల్లో చాలా వరకూ ఆరు నుంచి ఎనిమిదేళ్లలోపు వారే. నేడు బాలల దినోత్సవం(చిల్డ్రన్స్ డే). ఈ నేపథ్యంలో పిల్లలు వివిధ గెటప్‌లలో ముస్తాబై స్కూలకు వెళ్తున్నారు.
VIDEO | A school bus caught fire in #Ghaziabad earlier today. All 15 students onboard the bus were rescued safely.
— Press Trust of India (@PTI_News) November 14, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/JnY3oo2ka3