చెట్టును ఢీ కొట్టిన స్కూల్ బస్సు.. విద్యార్థులకు గాయాలు

 చెట్టును ఢీ కొట్టిన స్కూల్ బస్సు.. విద్యార్థులకు గాయాలు

మేడ్చల్ జిల్లా  కీసర మండలం కుందన్ పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది.  స్కూల్ పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది పిల్లలు ఉన్నారు.  స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  స్కూల్ బస్సులో ఉన్న పిల్లలంతా సేఫ్ గా  ఉన్నారు. 

 డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ ను టెస్ట్ చేయకుండానే బస్సు డ్రైవర్ గా పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు చిన్నారుల తల్లిదండ్రులు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారాణాలపై ఆరా తీస్తున్నారు.